![]() |
![]() |

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ 'కృష్ణ ముకుంద మురారి'. ఈ సీరియల్ శుక్రవారం నాటి ఎపిసోడ్ -233 లో.. రేవతి డల్ గా కూర్చొని కృష్ణ, మురారిల గురించి ఆలోచిస్తుంటుంది. నేను కూడా అక్కకి అగ్రిమెంట్ విషయం చెప్పకుండా మోసం చేస్తున్నానా అని రేవతి అనుకుంటుంది. అప్పుడే భవాని రేవతిని పిలుస్తుంది. ఏంటి అలా ఉన్నావని భవాని అడుగుతుంది. మనం కూడా ఇవన్ని దాటుకొని వచ్చిన వాళ్ళమే కదా.. అయిన వాళ్ళకి ఈ సమస్యలు కూడా వాళ్ళ పిల్లలకి చెప్పుకోవడానికి మంచి జ్ఞాపకాలుగా ఉంటాయని భవాని అంటుంది.
ఆ తర్వాత వాళ్ళ దగ్గరికి కృష్ణ వచ్చి.. తన ఫోన్ కి వచ్చిన మెసేజ్ ని భవానికి చూపిస్తుంది. ఏం చూపిస్తుందని రేవతి టెన్షన్ పడుతుంది. నీకు అవార్డు రావడం సంతోషంగా అనిపించింది కానీ ఇంత త్వరగా నువ్వు నీ జాబ్ గురించి బయటకు వెళ్తావా?నీకు ఇష్టం అయితేనే వెళ్ళమని భవాని అంటుంది. ఏమైందని రేవతి అడుగుతుంది. మన దగ్గర విలేజ్ లో విషజ్వరాలు ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయంట.. అందుకే కృష్ణ వాళ్ళంతా వెళ్ళి అక్కడి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలని డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్డర్ పాస్ చేశారు. నీకు ఇష్టమైతే వెళ్ళమని భవాని అనగానే.. ఇది మళ్ళీ తిరిగి రాదేమో అని రేవతి అనుకుంటుంది. ఆ తర్వాత కృష్ణ వెళ్తుంటే, ముకుంద ఆపుతుంది. నిన్ను చూస్తుంటే నన్ను నేను చూసుకున్నట్లు అనిపిస్తుంది కృష్ణ అని ముకుంద అంటుంది. ముకుంద నీకు ఒకటి చెప్పాలని కృష్ణ అంటుంది. ఏంటని ముకుంద అడుగుతుంది. గతంలో నీ లవ్ స్టోరీ ఎంత గొప్పదైన సరే, దాన్ని మర్చిపో ఎందుకంటే నీకు పెళ్లి అయింది నీకొక భర్త ఉన్నాడు. ఇప్పుడు అదంతా ఆలోచించడం కరెక్ట్ కాదని కృష్ణ అంటుంది. నీకొకటి చెప్పాలి ముకుంద.. నేను ఈ ఇంటి నుండి వెళ్లిపోతున్ననని కృష్ణ అనగానే.. నువ్వు వెళ్ళేది క్యాంపు కే కదా మళ్ళీ రానట్లు చెప్తున్నావని ముకుంద అంటుంది. అది నీకు తర్వాత అర్థమవుతుందని కృష్ణ అంటుంది. నీ ప్రేమని మర్చిపోమని ఎందుకు అన్నానంటే.. ఈ ఇంటికి పెద్ద కోడలివి నువ్వు.. అత్తయ్య గారు నాకు అప్పజెప్పిన బాధ్యతలు నీకు అప్పగిస్తున్నానని కృష్ణ అంటుంది. ఆ తర్వాత ముకుంద మనసులో హ్యాపీగా ఫీల్ అవుతూ.. కృష్ణని హగ్ చేసుకుంటుంది.
మరొకవైపు కృష్ణ వెళ్లి బ్యాగ్ సర్దుతుంటుంది. బ్యాగ్ జిప్ పెట్టడం కృష్ణకి కష్టంగా ఉంటుంది. హెల్ప్ చెయ్యాలని అనిపించలేదా అని కృష్ణ అంటుంది. చెయ్యమని నీకు అడగాలని అనిపించలేదా అని మురారి అంటాడు. కృష్ణ ఫొటోస్ అన్ని తీసుకొని బ్యాగ్ లో పెట్టుకుంటుంది. ఆ తర్వాత కృష్ణ ఇచ్చిన గిఫ్ట్ ని మురారి తీసుకొని వచ్చి కృష్ణకి ఇస్తాడు. అది చూసిన కృష్ణ ఎమోషనల్ అవుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.
![]() |
![]() |